Medak | సీనియర్ రాజకీయ వేత్త, మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి మృతి
Medak | టిడిపి ,కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చిట్టాపూర్ సర్పంచ్ నుంచి పంచాయతీ సమితి, ఎమ్మెల్యే, ఎంపీగా ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర రైతాంగ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో రాజకీయ ఉద్దందుడు మాజీ రాజ్యసభ సభ్యులు ఇకలేరు. మెదక్ ఉమ్మడి జిల్లా లోనే సీనియర్ రాజకీయవేత్త తొలితరం కమ్యూనిస్ట్ నాయకుల స్ఫూర్తితో రైతాంగ పోరాటంలో పాల్గొని చిట్టపూర్ సర్పంచ్ నుండి పంచాయతీ సమితి, ఎమ్మెల్యే, […]

Medak |
- టిడిపి ,కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని
- చిట్టాపూర్ సర్పంచ్ నుంచి పంచాయతీ సమితి, ఎమ్మెల్యే, ఎంపీగా
- ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర
- రైతాంగ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో రాజకీయ ఉద్దందుడు మాజీ రాజ్యసభ సభ్యులు ఇకలేరు.
మెదక్ ఉమ్మడి జిల్లా లోనే సీనియర్ రాజకీయవేత్త తొలితరం కమ్యూనిస్ట్ నాయకుల స్ఫూర్తితో రైతాంగ పోరాటంలో పాల్గొని చిట్టపూర్ సర్పంచ్ నుండి పంచాయతీ సమితి, ఎమ్మెల్యే, ఎంపీ రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన సోలిపేట రామచంద్రారెడ్డి ( 88) మంగళ వారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు.
దివంగత ఎమ్మెల్యే సోలిపేట,రామలింగారెడ్డి సమీప బంధువు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట రామచంద్రారెడ్డి మెదక్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా చెరగని ముద్ర వేశారు.ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్,టిడిపి పార్టీలకు అధ్యక్షులుగా పనిచేశారు.
చిట్టాపూర్ గ్రామ మొట్టమొదటి సర్పంచ్ గా రాజకీయాల్లోకి వచ్చిన అయన ఏన్నో పదవులను అలంకరించి న్యాయం చేశారు. చిట్టపూర్ సర్పంచ్ గా మొదలైన రామచంద్రారెడ్డి ప్రస్థానం దుబ్బాక పంచాయతీ సమితి అధ్యక్షులుగా,సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉమ్మడి (డీసీసీబీ) సహకార సంఘం చైర్మన్ గా పలు పదవులను అలంకరించి సేవచేశారు.
అప్పటి (దొమ్మట) ప్రస్తుత దుబ్బాక నియోజక వర్గం నుంచి 1972- నుండి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.1996 నుండి 2002 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. రాజ్యసభలో టిడిపి ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.టిడిపి పార్టీలో ఎన్టీఆర్, చంద్రాబాబులు విడిపోయినప్పుడు పార్టీ ప్రా ధాన కార్యదర్శిగా ఉండి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.
పార్టీ చీలిక సమయంలో చంద్రబాబు వెంట ఉండి సైకిల్ గుర్తు చంద్రబాబుకు వచ్చే విధంగా పార్టీ కార్యదర్శి హోదాలో పనిచేశారు. ఏపీ మినిరల్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. సిటీ కాలేజ్ లో విద్యాభ్యాసం చేసి పాటబద్రుడయ్యారు. మృతుడు రామచంద్రారెడ్డి కి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి చిన్న కుమార్తెను పెద్ద కుమారుడు బ్యాంక్ మేనేజర్ గా ఉన్న వెంకటేశ్వర రెడ్డి వివాహం చేసుకున్నారు.
సాయంత్రం…4 గంటలకు ఫిలింనగర్ మహా ప్రస్థానం అంత్యక్రియలు
నేటి సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు వెంకటేశ్వర రెడ్డి విధాత ప్రతినిధికి చెప్పారు. ప్రజల సందర్శనార్థం బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ 272 ఏ లో ఉంచారు.
మంత్రి హరీష్ రావు సంతాపం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రామచంద్రారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి,మైనం పల్లి హన్మంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆంతి రెడ్డి గారి విఠల్ రెడ్డి, వాసురెడ్డి , మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, సారాఫ్ యాదగిరి, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.