అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న జన్కంపల్లి రైతులు
రాస్తారోకో పోలీసుల వాగ్వివాదం హల్డి వాగునుండి అక్రమ ఇసుక వ్యాపారం విధాత, మెదక్ బ్యూరో: ఇసుక,వ్యాపారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై హల్ది,వాగు,మంజీరా నది నుండి ఇసుకను హైదరాబాద్,తోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.పేరుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకని,రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్నానని సాకు చెప్పి ఇసుక మా ఫీయా యదేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఒకచోట డంపు చేసుకొని అమ్ముకుంటున్నారు.ఇదంతా పోలీస్ లు,రెవెన్యూ అధికారుల కనుసన్నలలో జరగడం అందరికీ తెలిసిందే. హాల్ది ,మంజీర నదుల నుండి ఇసుకను […]

- రాస్తారోకో పోలీసుల వాగ్వివాదం
- హల్డి వాగునుండి అక్రమ ఇసుక వ్యాపారం
విధాత, మెదక్ బ్యూరో: ఇసుక,వ్యాపారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై హల్ది,వాగు,మంజీరా నది నుండి ఇసుకను హైదరాబాద్,తోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.పేరుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకని,రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్నానని సాకు చెప్పి ఇసుక మా ఫీయా యదేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.
ఒకచోట డంపు చేసుకొని అమ్ముకుంటున్నారు.ఇదంతా పోలీస్ లు,రెవెన్యూ అధికారుల కనుసన్నలలో జరగడం అందరికీ తెలిసిందే. హాల్ది ,మంజీర నదుల నుండి ఇసుకను తీయద్దని రైతుల తరపున బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వి,ప్రతాప్ రెడ్డి రైతుల తరపున కోర్టులో పిటిషన్ వేసి రైతుల తరపున ఆర్డర్స్ తెచ్చారు.
ఐనప్పటికీ ఇసుక తరలింపు ఆగడం లేదు.కోర్టు నిబంధనలు అమలు చేయాల్సిన పోలీస్ లు,రెవెన్యూ అధికారులు చేతి వాటం ప్రదర్శించడంతో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని చెప్పొచ్చు.గురువారం రోజు మెదక్ మండలం జాన్కంపేట గ్రామ శివారులో హాల్డి వాగు నుండి తరలిస్తున్న లారీలను రైతులు అడ్డుకొని రాస్తారోకో చేస్తున్నారు.
ప్రభుత్వ పథాలు,ఇతర కాంట్రాక్టు పనులకు ఉపయిగించే ఇసుకను ఏక్కడి నుండి తేవాలని కోడ్ చేసి ఉంటుంది,తోందరగా పనులు కావాలనే ఉద్దేశంతో నాయకులు,అధికారులు ,ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ అధికారుల ద్వారా ఇసుక పర్మిట్లు ఇప్పిస్తున్నారు.ఒక్క లారీ ఇసుక ప్రభుత్వ పథకాలకు మల్లిస్తే 9 లారిల ఇసుక మధ్య దాలారిలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.ఈ క్రమంలో నెల,నెల మామూళ్ల మత్తులో అధికారులు కళ్ళు మూసుకుంటన్నారు.
ఇసుక దందాలో ఆరితేరిన దళారులు.
హవేలీ ఘనపూర్ మండలం సర్దేన గ్రామం వద్ద గతం లో ఎర్పాటు చేసిన ఇసుక పాయింట్ వద్ద సహితం పర్మిట్ లలో మాయాజాలంతో రోజుకు వందల లారీల ఇసుకను మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.అధికార పార్టీ కి చెందిన ఒక ఎంపీ అధ్వర్యంలో ఈ తతంగం సాగింది.మంజీర, హల్డి వాగుల నుండి నిత్యం ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.