కోదాడ BRSలో రచ్చకెక్కిన వర్గపోరు.. ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీలు
విధాత: కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా పార్టీ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు వర్గాల మధ్య సాగుతున్న వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. శశిధర్ రెడ్డి ఈ నెల 25న తలపెట్టిన మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను చందర్ రావు నివాసంలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఫోటో, శశిధర్ రెడ్డి, […]

విధాత: కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా పార్టీ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు వర్గాల మధ్య సాగుతున్న వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది.
శశిధర్ రెడ్డి ఈ నెల 25న తలపెట్టిన మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను చందర్ రావు నివాసంలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఫోటో, శశిధర్ రెడ్డి, చందర్ రావుల ఫోటోలు ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫొటో మాత్రం ముద్రించలేదు.
ఈ వ్యవహారం నియోజకవర్గంలో సాగుతున్న వర్గ పోరుకు నిదర్శనంగా నిలిచింది. అటు చిలుకూరు మండలం బేతవోలులో సాగుతున్న కనకదుర్గమ్మ జాతరలో కూడా కన్మంత్ రెడ్డి ,చందర్ రావు వర్గాలు, బొల్లం మల్లయ్య వర్గం వేర్వేరుగా సభలు ప్రదర్శనలు చేపట్టారు.
అధికార బీఆర్ఎస్ పార్టీలో కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు శశిధర్ రెడ్డి, చందర్ రావులు సాగిస్తున్న వర్గ పోరు ఎన్నికల నాటికి మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా కోదాడ బీఆర్ఎస్‌లో నెలకొన్న వర్గవిభేదాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని అసమ్మతి వాదులను తమ వైపు లాగేందుకు అటు వైకాపా, బీజేపీలు సైతం తెర వెనక పావులు కదుపుతుండటంతో ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి.