Guntur Kaaram | గుంటూరు కారం: అఖరుకు మహేశ్‌బాబు అయినా ఉంటాడా! అడుగుకో ఆటంకం.. ఇలా అయితే కష్టమే!
Guntur Kaaram | విధాత: సినిమా అన్నాకా అందరూ ఓకే అనుకుని ఓ తాటి మీద వెళితేనే అది పట్టాలెక్కుతుంది. వినాయకుడి పెళ్ళికి అన్నీ అవాంతరాలే అన్నట్టు.. ఏ ముహుర్తాన మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా అనుకున్నారో కానీ ఆ ప్రాజెక్ట్‌కి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారని ఫ్యాన్స్ సంతోష పడినంత సమయం లేకపోయింది నీరసం రావడానికి.. నిరాశ కలగడానికి. వీళ్ల కాంబినేషన్‌లో […]

Guntur Kaaram |
విధాత: సినిమా అన్నాకా అందరూ ఓకే అనుకుని ఓ తాటి మీద వెళితేనే అది పట్టాలెక్కుతుంది. వినాయకుడి పెళ్ళికి అన్నీ అవాంతరాలే అన్నట్టు.. ఏ ముహుర్తాన మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా అనుకున్నారో కానీ ఆ ప్రాజెక్ట్‌కి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి.
దాదాపు 13 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారని ఫ్యాన్స్ సంతోష పడినంత సమయం లేకపోయింది నీరసం రావడానికి.. నిరాశ కలగడానికి. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు, ఖలేజా’ సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు.
సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. బుల్లితెరపై మాత్రం పెద్ద హిట్‌గా నిలిచాయి.. నిలుస్తున్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు ప్రసారం అయినా ఇప్పటికీ వదలకుండా చూస్తారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ సినిమాలు అప్పట్లో ఆడి ఉంటే ఈ ఇద్దరి కాంబినేషన్ ఎక్కడో ఉండేది.
అయితే ఒక సినిమా విజయం ప్రేక్షకుల చేతిలో మాత్రమే ఉంటుంది కదా.. అయినా సరే త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ మొదటి నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నదే. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా త్వరలో రాబోతుందని ఆశ పడినంత సేపు లేకుండా పూటకో ట్విస్ట్‌తో ఫ్యాన్స్‌కు కూడా పిచ్చెక్కిస్తున్నారు.
‘గుంటూరు కారం’ రాబోతుంది అనుకున్నాక కథలో జరిగిన మార్పుల దగ్గర నుంచి, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వాళ్ళు, ముందుగా పూజా హెగ్డేను సెకండ్ హీరోయిన్‌గా డిమోట్ చేసి తీసుకుంటున్నారని తెలియగానే ఆ భామ అలిగి వెళ్లిపోయింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి థమన్ మరో ట్విస్ట్ అతను అనుకున్న టైంకి ట్యూన్స్ ఇవ్వడం లేదనే టాక్ వచ్చింది. ఈ ఆలస్యం నచ్చక మహేషే పక్కన కూర్చో బెట్టాడనే న్యూస్ కూడా నడుస్తుంది. అయితే మరో న్యూస్ ఏంటంటే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్‌తో వినోద్ రెండు సినిమాలకు వర్క్ చేశాడు. మరి త్రివిక్రమ్‌కి వినోద్‌కి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ లండన్‌లో ఉన్నాడు. అక్కడ నుంచి తిరిగి రాగానే ఈ షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈలోపు మరో కెమెరామెన్ కోసం చూస్తున్నారు. ఈ సినిమా అనుకున్నాక అస్తవ్యస్తంగా ప్రాజెక్ట్ నడుస్తుంటే సినిమా మొత్తం పూర్తయ్యి, బయటకు వచ్చేలోపు ఇంకెంత గందరగోళం నెలకొంటుందో అనుకుంటున్నారు ఫ్యాన్స్. అఖరుకు మహేశ్‌బాబు అయినా సినిమాలో ఉంటాడా మధ్యలోనే వెళ్లిపోతాడా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏదైనా అనుకోగానే ఆ ప్రయత్నం ముందుకు వెళితే పరవాలేదు గానీ, ఇలా అడుగుకో ఆటంకం తగిలితేనే ఇది సవ్యంగా ముందుకు వెళుతుందా లేక బోర్లా పడుతుందా అనే అనుమానాలు వస్తాయి. చూద్దాం ఏం కానుందో మరి.