సురేఖా వాణి తట్టుకోలేక.. ఓపెన్ అయిపోయింది

విధాత: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి అందరికీ తెలిసిన నటే. ఈ మధ్యకాలంలో ఇంతకుముందులా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. ఆ మధ్యకాలంలో సురేఖా వాణి లేని సినిమా ఉండేది కాదు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలలో ఆమెకు మంచి పాత్రలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకు పాత్రలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఆమె భర్త కూడా ఈ మధ్యనే చనిపోయారు. కుమార్తెతో కలిసి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే సురేఖా వాణి.. చాలా గ్యాప్ […]

  • By: krs    latest    Oct 07, 2022 6:28 PM IST
సురేఖా వాణి తట్టుకోలేక.. ఓపెన్ అయిపోయింది

విధాత: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి అందరికీ తెలిసిన నటే. ఈ మధ్యకాలంలో ఇంతకుముందులా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. ఆ మధ్యకాలంలో సురేఖా వాణి లేని సినిమా ఉండేది కాదు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలలో ఆమెకు మంచి పాత్రలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకు పాత్రలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఆమె భర్త కూడా ఈ మధ్యనే చనిపోయారు.

కుమార్తెతో కలిసి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే సురేఖా వాణి.. చాలా గ్యాప్ తర్వాత ‘స్వాతిముత్యం’ సినిమాలో మెరిసింది. సినిమాలో ఆమెకు మంచి పాత్రే లభించింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సురేఖా వాణి తట్టుకోలేక ఓపెన్ అయిపోయింది. తను సినిమాలు చేయడం మానేయ లేదని, తన వరకు అవకాశాలు రానివ్వడం లేదంటూ.. ఈ వేడుకలో సురేఖా వాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘స్వాతిముత్యం’ సక్సెస్ మీట్‌లో సురేఖా వాణి మాట్లాడుతూ.. ‘‘మా లవింగ్ డార్లింగ్స్ అందరినీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా వీరందరినీ చూడటానికి అవకాశం కల్పించిన మా డైరెక్టర్‌గారికి, అలాగే మా బ్యానర్ వారికి రుణపడి ఉంటాను. చాలా మంది అడుగుతున్నారు.. సినిమాలు చేయడం లేదు.. సినిమాలు చేయండి.. ఇలాంటి పాత్రలు చేయండి.. ఈ సినిమాలో మీ పాత్ర చాలా బాగుంది.. అని అడుగుతున్నారు. మా దాకా వస్తే కదా.. మేము చేయడానికి.

ఈ సినిమా దర్శకుడిని కూడా.. నాకు పాత్ర చెప్పడానికి వచ్చినప్పుడు.. ఈ పాత్రకి ముందు నన్నే అనుకున్నావా? అని అడిగాను. ఎందుకంటే వేరే ఎవరినైనా అనుకుని, వారు చేయనంటే నా దగ్గరకి వచ్చాడేమో అని. ఎందుకంటే ఈ మధ్య మా దగ్గరకి ఎవరూ రావడం లేదు. దానికి కారణం ఏమిటో నాకూ తెలియడం లేదు. వస్తే బాగుంటుంది.. వస్తే తప్పకుండా చేస్తాం.

సురేఖా వాణి సినిమాలు మానేసిందని అందరూ అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ మానేయను. నేను సినిమా అమ్మాయిని.. సినిమా కోసమే ఉన్నాను.. సినిమాలు చేస్తూనే ఉంటాను. ఈ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు లక్ష్మణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. హీరో గణేష్‌కు మొదటి సినిమానే ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్..’’ అని సురేఖా వాణి చెప్పుకొచ్చింది.