ఆర్థిక ఇబ్బందులు.. ఛార్జింగ్ వైర్‌తో భార్య, కూతురిని చంపి యువకుడు ఆత్మహత్య
విధాత: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన రెండేండ్ల కూతురును, భార్యను చంపేశాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఒడిశా కోరాపూట్ జిల్లా పరిధిలోని తోయపుట్ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తోయపుట్ గ్రామానికి చెందిన లింగరాజు బిశోయ్(27) స్థానికంగా మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ షాపు సరిగా నడవకపోవడంతో.. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో మానసికంగా కుంగిపోయాడు. […]

విధాత: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన రెండేండ్ల కూతురును, భార్యను చంపేశాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఒడిశా కోరాపూట్ జిల్లా పరిధిలోని తోయపుట్ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తోయపుట్ గ్రామానికి చెందిన లింగరాజు బిశోయ్(27) స్థానికంగా మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ షాపు సరిగా నడవకపోవడంతో.. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో మానసికంగా కుంగిపోయాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి మొబైల్ షాపు నుంచి ఇంటికి వచ్చాడు.
అనంతరం తలుపులు మూసేసి, మొదట భార్య జ్యోత్స్న(24) మెడకు ఛార్జింగ్ వైర్ బిగించి చంపేశాడు. అనంతరం రెండేండ్ల కూతురు ఇషాను కూడా చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే లింగరాజు ఉరేసుకున్నాడు.
కాగా.. లింగరాజు నివాసంలో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో రాత్రి 9 గంటల సమయంలో తలుపు తట్టినప్పటికీ, ఎవరూ బయటకు రాలేదు. స్థానికులంతా కలిసి లింగరాజు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా, ఆ ముగ్గురు కూడా విగతజీవుల్లా పడిపోయి ఉన్నారు.
వెంటనే స్థానికులు లక్ష్మీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లింగరాజు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తోయపుట్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.