రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా డాక్టర్ మృతి
విధాత : తిరుపతి జిల్లా పరిధిలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి భవనంలోని పై అంతస్తులో చెలరేగిన మంటలకు డాక్టర్ సజీవదహనం అయ్యాడు. ఆయన ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కార్తీకేయ పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రిలోని పై అంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా రవిశంకర్ రెడ్డి […]

విధాత : తిరుపతి జిల్లా పరిధిలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి భవనంలోని పై అంతస్తులో చెలరేగిన మంటలకు డాక్టర్ సజీవదహనం అయ్యాడు. ఆయన ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కార్తీకేయ పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రిలోని పై అంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా రవిశంకర్ రెడ్డి ఉండే అంతస్తులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆ అంతస్తుకు చేరుకుని, డాక్టర్ భార్య, అత్త, ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చారు.
అప్పటికే డాక్టర్ మంటల్లో కాలిపోయారు. ఇద్దరు పిల్లలు కార్తీక(15), భరత్(12) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో ఆస్పత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.