పశ్చిమ బెంగాల్‌లో అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లా పశ్చిమ్ బర్ధమాన్‌లోని కుల్తీ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

  • By: Somu    latest    Nov 25, 2023 11:22 AM IST
పశ్చిమ బెంగాల్‌లో అగ్నిప్రమాదం
  • కుల్టీ రైల్వే స్టేషన్‌లో చెల‌రేగిన మంటలు
  • సోష‌ల్ మీడియాలో విజువల్స్ వైర‌ల్‌



విధాత‌: పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లా పశ్చిమ్ బర్ధమాన్‌లోని కుల్తీ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


అగ్ని ప్ర‌మాదానికి సంబంధించిన విజువ‌ల్స్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రైల్వేస్టేష‌న‌ల్ భారీగా చెల‌రేగుతున్న మంట‌లు, ద‌ట్ట‌మైన పొగ వ్యాపిస్తున్న‌ట్టు విజువ‌ల్స్‌లో క‌నిపిస్తున్న‌ది. మంటలు ఎందుకు చెల‌రేగాయి? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? ఈ ఘటనలో ఏదైనా ప్రాణనష్టం, గాయాలు జరిగాయా అనేది తెలియ‌రాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.