తొలిసారి.. అధికారికంగా కొమరయ్య జయంతి ఉత్సవాలు! గ్రూపుల వారిగా BRS శ్రేణుల నివాళులు!
విధాత: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం అటు అధికార యంత్రాంగం ఇటు బిఆర్ఎస్ శ్రేణులు కొమరయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కొమురయ్య ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి జిల్లా కలెక్టరేట్ లలో అధికారికంగా కొమురయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ కలెక్టరేట్ లో కలెక్టర్ వినయ్ […]

విధాత: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం అటు అధికార యంత్రాంగం ఇటు బిఆర్ఎస్ శ్రేణులు కొమరయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం కొమురయ్య ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి జిల్లా కలెక్టరేట్ లలో అధికారికంగా కొమురయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
నల్గొండ కలెక్టరేట్ లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి , జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున సహా పలు పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు జిల్లా కేంద్రం నల్గొండలోని కొమరయ్య విగ్రహానికి స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కెవి. రమణ చారి , బిఆర్ఎస్ నాయకులు కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం బీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు తన వర్గీయులతో కలిసి కొమురయ్య విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓకే పార్టీకి చెందిన నేతలు కంచర్ల, రామరాజులు వేర్వేరుగా కొమురయ్య విగ్రహం వద్ద నివాళులర్పించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.