Pravesh Shukla | మాయమైపోతున్నడో.. మనిషన్నవాడు..! ఆదివాసీపై.. బీజేపీ యువ నేత మూత్ర విసర్జన! నెటిజన్ల ఫైర్!

Pravesh Shukla బీజేపీ యువ నేత నిర్వాకం ఆదివాసీపై మూత్ర విసర్జన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మండిపడుతున్న నెటిజన్లు విధాత: మాయమైపోతున్నడన్నో.. మనిషన్నవాడు.. అన్న ఆవేదనకు నిదర్శనంగా ఉంది… మధ్యప్రదేశ్ బీజేపీ నేత దాష్టీకం. ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్న ఆదివాసీ నిరుపేద వ్యక్తిపై మధ్యప్రదేశ్ బీజేపీ యూత్ లీడర్ ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అతడి అమానవీయ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫుట్ పాత్ పై కూర్చొని ఉన్న […]

Pravesh Shukla | మాయమైపోతున్నడో.. మనిషన్నవాడు..! ఆదివాసీపై.. బీజేపీ యువ నేత మూత్ర విసర్జన! నెటిజన్ల ఫైర్!

Pravesh Shukla

  • బీజేపీ యువ నేత నిర్వాకం
  • ఆదివాసీపై మూత్ర విసర్జన
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌
  • మండిపడుతున్న నెటిజన్లు

విధాత: మాయమైపోతున్నడన్నో.. మనిషన్నవాడు.. అన్న ఆవేదనకు నిదర్శనంగా ఉంది… మధ్యప్రదేశ్ బీజేపీ నేత దాష్టీకం. ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్న ఆదివాసీ నిరుపేద వ్యక్తిపై మధ్యప్రదేశ్ బీజేపీ యూత్ లీడర్ ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అతడి అమానవీయ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఫుట్ పాత్ పై కూర్చొని ఉన్న ఆదివాసీపై శుక్లా మద్యం మైకం తలకెక్కగా సిగరెట్ కాలుస్తూ మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహాన్ని రగిలించింది. బాధిత ఆదివాసీ దుస్థితిని తలుచుకుని అయ్యో అనుకుంటున్నారు.

సదరు ఆదివాసీకి మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే ప్రవేశ్ శుక్లా రాక్షసానందానికి అడ్డు లేకుండా పోయి వుండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సమాజంలో కనీస మానవతా విలువలు కరువైపోతున్న దయనీయ పరిస్థితిని ఈ దుర్మార్గ చర్య మరోసారి చర్చనీయాంశం చేసింది.