బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్.. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత 17 ఏండ్లుగా బీఆర్ఎస్‌లో కొనసాగానని, ఈ కాలంలో పార్టీలో సహకరించిన వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పురాణం సతీశ్ లేఖ విడుదల చేశారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడమే తప్పు అని సతీశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌గా పేరు మార్చడం వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పురాణం సతీష్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.