పొలిటికల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువై బీజేపీ లోకి బీజేపి లో విజయశాంతి చేరికతో ఆ పార్టీకిరాజీనామా. అప్పటినుండి ఊగిసలాటలో శశిధర్ రెడ్డి రాజకీయ భవితవ్యం… నిన్న మొన్నటిదాకా బి అర్ యస్ లోకివెళ్తారని ప్రచారం కార్పొరేషన్ చైర్మన్ పదవికి శశి మెలికపెట్టడంతో ఆలోచిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానవర్గం.. విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడు 2004 లో స్వతంత్ర అభ్యర్థిగా రైతు నాగలి గుర్తుపై మెదక్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ప్రధాన […]

కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువై బీజేపీ లోకి
బీజేపి లో విజయశాంతి చేరికతో ఆ పార్టీకిరాజీనామా.
అప్పటినుండి ఊగిసలాటలో శశిధర్ రెడ్డి రాజకీయ భవితవ్యం…
నిన్న మొన్నటిదాకా బి అర్ యస్ లోకివెళ్తారని ప్రచారం
కార్పొరేషన్ చైర్మన్ పదవికి శశి మెలికపెట్టడంతో ఆలోచిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానవర్గం..
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడు 2004 లో స్వతంత్ర అభ్యర్థిగా రైతు నాగలి గుర్తుపై మెదక్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ప్రధాన పార్టీ అభ్యర్థులను చిత్తు చేసిన ఎమ్మెల్యేగా గెలిచిన బలం,బలగం ఉన్న నాయకుడు పట్లోళ్ళ శశిధర్ రెడ్డి. అయన తండ్రి మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఏదిగి తండ్రి నారయణ రెడ్డి మరణానంతరం రాజకీయ వారసునిగా ఎదిగారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడినుండి ప్రాతినిధ్యం వహించిన కరణం రాంచందర్ రావు మరణంతో మెదక్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో శశిధర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. ఆ ఉప ఎన్నికల్లో శశిధర్ రెడ్డి కరణం రాంచందర్ రావు సతీమణి ఉమాదేవి చేతిలో ఓడిపోయారు.2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పోత్తు పెట్టుకోవడంతో పొత్తులో భాగంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని టిఆర్ఎస్ కు కేటాయించారు. విద్యాసంస్థల అధినేత వై,ప్రభాకర్ రెడ్డి కి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శశిధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ బరిలో నిలిచారు.శశిధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా, వై,ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా,టిడిపి అభ్యర్థిగా కరణం ఉమాదేవి లు పోటీ చేయగా శశిధర్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం,సీఎంగా వై యస్ రాజశేఖర్ రెడ్డి ఉండడం తో శశిధర్ రెడ్డి కాంగ్రెస్ అసోసియేట్ సభ్యుడుగా శాసన సభ లో కొనసాగారు.అప్పుడు ఉమ్మడి జిల్లాలో చక్రంతిప్పిన శశిధర్ రెడ్డి కాలక్రమంలో వై యస్ మరణానంతరం, కాంగ్రెస్ లో ఆయన ప్రభావం తగ్గింది. 2009 లో టి డీ పీ, టిఆర్ఎస్,మహాకూటమి ఏర్పడడం అప్పటికే మెదక్ ఉమ్మడిజిల్లాకు టిడిపి జిల్లా అధ్యక్షుడు గా మైనంపల్లి హన్మంతరావు ఉండడం, అప్పటికే రామాయంపేట శాసనసభా స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా చేయడం, ఆ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి పై విజయం సాధించారు.
2009 లోనే రామాయంపేట శాసన సభ స్థానాన్ని డిలిమిటేశన్ లో రద్దు పరిచి కొత్తగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు మండలాన్ని నియోజక వర్గం చేశారు. దీంతో కొంత మంది లీడర్ల భవితవ్యం మారి పోయింది.రామాయంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మైనంపల్లి హన్మంతరావు టిడిపి,టిఆర్ఎస్ పొత్తులో బాగంగా 2009 లో మెదక్ అసెంబ్లీ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డి కి కాకుండా మైనంపల్లి హన్మంతరావు కు దక్కింది.
దీంతో పార్టీ అధిష్టాన వర్గాన్ని దిక్కరించి పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి డిపాజిట్ గల్లంతు కావడం,కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలో ఉన్న శశిధర్ రెడ్డి పై మైనంపల్లి హన్మంతరావు 19 వేలపై చీలిక ఓట్లతో గెలుపొందారు.తిరిగి 20014 ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నియోజక వర్గానికి వెళ్లడంతో టిఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డి కి కేటాయించారు.కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.
2014 లో మెదక్ నుండి కాంగ్రెస్ టికెట్ దక్కని శశిధర్ రెడ్డి అనుహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నటి విజయశాంతి.
2014 నుండే మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కి పార్టీలో కష్టాలు మొదలయ్యాయి. పార్టీలో ఉండి విజయశాంతినీ కాదని టిఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి కి మద్దతు ఇచ్చారని తన ఓటమికి శశిధర్ రెడ్డి కారణమని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి విజయ శాంతి పిర్యాదు చేశారు.దీంతో పార్టీలో అంటిముట్టని విధంగా వ్యవహరించడం క్రమక్రమంగా శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కు దూరమయ్యారు.
బీజేపీ…లోకి
శశిధర్ రెడ్డి బీజేపీ లో చేరారు.మళ్ళీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నీ వీడి బీజేపీ లో చేరారు.మెదక్ జిల్లాలో బండి సంజయ్ పాద యాత్ర కు ఒక్క రోజు ముందు బీజేపీపికి రాజీనామా చేశారు. ఒకే పార్టీలో విజయశాంతి తో పడక ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ లో శశికి ఆదరణ కరువు
బీజేపీ కి రాజీనామా చేసిన శశిధర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డీసీసీ అధ్యక్షుడు గా ఉన్న తిరుపతి రెడ్డి,సీనియర్ నాయకులు సుప్రభాత రావు,మ్యాడమ్ బాలకృష్ణ శశి రాకను వ్యతిరేకించి నట్లు తెలుస్తుంది..
పొలిటికల్ చౌరస్తాలో శశిధర్ రెడ్డి…
స్థిరత్వం లేని రాజకీయ నిర్ణయాలవల్ల శశిధర్ రెడ్డి అనుచరుల్లో గందర గోళం నెలకొంది.బి అర్ యస్ పార్టీలో శశిధర్ రెడ్డి చేరిక ఖాయమనే వార్తలు వచ్చాయి.ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకున్న కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే పార్టీలో కి వస్తానని మంత్రి హరీష్ రావు సమక్షంలో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏమైoదో తెలియదు కానీ మళ్ళీ శశిధర్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీలో చేరిక పెండింగ్ లో పడింది..రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశిధర్ రెడ్డి రాజకీయ చౌరస్తాలో..నిలబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తారా,బిఅర్ఎస్ లో కు వెళ్తారో, ఎటువైపు వెళ్తారో ఏనిర్ణయం తీసుకుంటారో వేచి చేదాల్సిందే…