Venkaiah Naidu | విజ్ఞాన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విద్య, సాధికారతతోనే సమాజ పురోభివృద్ధి ప్రకృతితో స్నేహపూర్వకంగా ఉండి, ప్రగతిని సాధించండి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందని చెప్పారు. అనాదిగా ఈ దేశానికి విద్యాపరమైన గొప్ప చరిత్ర ఉందని నలంద (Nalanda), తక్షశిల (Taxila) లాంటి యూనివర్సిటీ (University)లు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాయని […]

Venkaiah Naidu | విజ్ఞాన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • విద్య, సాధికారతతోనే సమాజ పురోభివృద్ధి
  • ప్రకృతితో స్నేహపూర్వకంగా ఉండి, ప్రగతిని సాధించండి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందని చెప్పారు.

అనాదిగా ఈ దేశానికి విద్యాపరమైన గొప్ప చరిత్ర ఉందని నలంద (Nalanda), తక్షశిల (Taxila) లాంటి యూనివర్సిటీ (University)లు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాయని గుర్తు చేశారు. హనుమకొండ (Hanumakonda) లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ (Chaitanya Deemed University) శనివారం జరిగిన 11 స్నాతకోత్సవానికి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు

బుల్లెట్ (Bullet) కంటే బ్యాలెట్ (Ballot) బలమైందని వెంకయ్య చెప్పారు. కులమత (caste religion) విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాటికి వ్యతిరేకంగా మనం సమిష్టిగా పని చేయాలన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం సమాజ మార్పులో కీలక భాగస్వామ్యం వహిస్తుందని అన్నారు. మూడవ అతిపెద్ద ఎకానమీతో దేశం ఉందన్నారు. విస్తృతమైన విద్యా విధానం ఈ దేశంలో అమలవుతుందని చెప్పారు. 50 శాతం మంది యువ జనాభాతో గొప్ప సంపద కలిగి ఉందన్నారు.

సామాజిక అభివృద్ధిలో సామాన్యులకు భాగస్వామ్యమైనప్పుడే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందని అన్నారు. శాంతియుత ప్రపంచం, శాంతియుత దేశం, శాంతియుత సమాజానికి తోడు వెల్త్, హెల్త్, పీస్ ఉంటేనే సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతామన్నారు. అప్పుడే దేశంలో దారిద్ర్యాన్ని తొలగించగలుగుతామన్నారు. ఉన్నతమైన విద్య వల్ల సాధికారత సాధించగలుగుతామని, సాధికారతతో సౌబ్రాతృత్వం పెరుగుతుందన్నారు.

సంపదను పెంచి ప్రజలకు పంచండి

సంపద పెంచి ఇతరులకు పంచండి అనే నినాదంతో ముందుకు సాగాలని వెంకయ్య అన్నారు. సంపద పెంచకుండా ఇతరులకు పంచితే పంచమిగులుతుందని హెచ్చరించారు. ప్రకృతితో స్నేహంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు.

మనం ఇటీవల నిర్వర్యం చేస్తున్నామని, నీటి వనరుల ధ్వంసం, ప్రకృతి ధ్వంసం ఫలితంగా కరువు, వరద లాంటి ప్రకృతి విలయాలు తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతితో స్నేహం, సంస్కృతి పరిరక్షణతోనే మంచి సమాజం ఆవిర్భవిస్తుందన్నారు. జాతీయ భావంతో ముందుకు సాగాలన్నారు.

మాతృభాషను మరవకండి

ఇంగ్లీషు భాష నేర్చుకోండి కానీ ఇంగ్లీష్ సంస్కృతిని అలవర్చుకోవద్దని సూచించారు. ప్రజలకు వచ్చే భాషలో ప్రభుత్వాలు పని చేయాలి. కలెక్టర్ కూడా తెలుగు మాట్లాడాలి. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరువకూడదని వెంకయ్య నాయుడు హితవు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ వెంకయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు.