తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..! నాలుగు ప్రత్యేక రైళ్లు..!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.

Special Trains | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను పట్టాలెక్కించినట్లు పేర్కొంది. ఈ రైళ్లు ఈ నెల 25 నుంచి 28 వరకు నడుస్తాయని పేర్కొంది. 25న సికింద్రాబాద్ – తిరుపతి (07041) ప్రత్యేక రైలు నడువనుండగా.. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 26న తిరుపతి – సికింద్రాబాద్ (07042) మధ్య స్పెషల్ ట్రైన్ పరుగులు తీయనుండగా.. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 7.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. 27న సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అందుబాటులో ఉంటుంది.
ఈ రైలు సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతికి చేరుతుంది. 28న తిరుపతి – సికింద్రాబాద్ (02763) మధ్య ప్రత్యేక రైలు పరుగులు తీయనున్నది. ఈ రైలు సాయంత్రం 5.15 గంటల్ బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (07041-07042) సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగుతాయని చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (02764-02763) రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాలా, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణింగుంట స్టేషన్స్‌లో ఆగుతాయని, ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.