Pak vs SL:బంతితో బ్యాట్స్‌మెన్‌ ప‌రుగు.. వెన‌క ప‌డిన కీప‌ర్.. తెగ న‌వ్వుకున్న క్రికెటర్స్

Pak vs SL: ఎంత సీరియ‌స్ గేమ్ అయిన స‌రే కొన్నిసార్లు ఆ గేమ్‌లో కొన్ని ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ కూడా జ‌రుగుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు అయితే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్‌లో జ‌రిగిన ఫ‌న్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గాలె స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పదకొండో నెంబర్ బ్యాటర్ అబ్రార్ అహ్మద్ త‌ను బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఫ‌న్నీ చేష్ట‌ల‌తో న‌వ్వించాడు. […]

  • By: sn    latest    Jul 19, 2023 4:00 PM IST
Pak vs SL:బంతితో బ్యాట్స్‌మెన్‌ ప‌రుగు.. వెన‌క ప‌డిన కీప‌ర్.. తెగ న‌వ్వుకున్న క్రికెటర్స్

Pak vs SL: ఎంత సీరియ‌స్ గేమ్ అయిన స‌రే కొన్నిసార్లు ఆ గేమ్‌లో కొన్ని ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ కూడా జ‌రుగుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు అయితే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్‌లో జ‌రిగిన ఫ‌న్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గాలె స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పదకొండో నెంబర్ బ్యాటర్ అబ్రార్ అహ్మద్ త‌ను బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఫ‌న్నీ చేష్ట‌ల‌తో న‌వ్వించాడు. పాక్ మొదటి ఇన్నింగ్స్ 120వ ఓవర్లో లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ వేసిన బంతిని అబ్రార్ స‌రిగ్గా అంచ‌నా వేయ‌క‌పోవ‌డంతో బాల్ గ్ల‌వ్ తాకి అత‌ని ప్యాడ్‌లో ప‌డింది.

అయితే అది చూసిన శ్రీలంక వికెట్ కీప‌ర్ సదీర సమరవిక్రమ.. బంతిని అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అబ్రార్ అతనికి ఆ అవకాశం ఇవ్వ‌కుండా పక్కకు తప్పుకొని క్రీజ్ దాటుకొని ముందుకు వెళ్లాడు.అయితే ఇది గుర్తించిన సమరవిక్రమ త్రో వేయాల‌ని ట్రై చేయ‌గా, అత‌ను వేయకముందే క్రీజులోకి వెళ్లిపోయాడు అబ్రార్. ఈ ఫ‌న్నీ సీన్ చూసి ప్ర‌తి ఒక్క‌రు న‌వ్వుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అబ్రార్ చేసిన పనికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అయితే పెద్ద‌గా నవ్వేస్తూ కనిపించాడు. ఇందులో అబ్రార్ పది పరుగులు చేసిన ప్ర‌తి ఒక్క‌రికి మాత్రం ఫన్ అందించాడు.

అయితే పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ 149 పరుగుల ఆధిక్యం సంపాదించింది. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ అద్భుతంగా ఆడి రికార్డు సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన (208 నాటౌట్ 361 బంతుల్లో) తొలి పాకిస్థాన్ ఆటగాడిగా ఘ‌న‌త సాధించాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహమ్మద్ హఫీజ్ (196), యూనిస్ ఖాన్ (177) మాత్రమే ఉండేవారు. ఇప్పుడు తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన సౌద్ షకీల్.. అగ్రస్థానం ద‌క్కించుకున్నాడు.. శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ బ్యాటర్‌గా ఘ‌న‌త సాధించాడు.