రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా.. గెల్లు శ్రీనివాస్ యాదవ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్ గా శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్ గా శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం శ్రీ కేసీఆర్ నియమించారు. సీఎం నిర్ణయం మేరకు సీఎస్ ఉత్తర్వులను జారీ చేశారు.
తన నియామక ఉత్తర్వును సీఎం చేతులమీదుగా ఈరోజు ప్రగతి భవన్ లో అందుకున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్. pic.twitter.com/zYNHrDOm4t
— Telangana CMO (@TelanganaCMO) April 4, 2023
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన లక్ష్మి-మల్లయ్య దంపతులకు గెల్లు శ్రీనివాస్ 1983, ఆగస్టు 21వ తేదీన జన్మించారు. ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
తండ్రి గెల్లు మల్లయ్య గతంలో కొండపాక ఎంపీటీసీగా పని చేశారు. తల్లి లక్ష్మి హిమ్మత్‌నగర్ సర్పంచ్‌గా సేవలందించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.