Medak | భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న ఘనపూర్ (వనదుర్గా) ప్రాజెక్టు

Medak ఏడుపాయల వన దుర్గామాత ఆలయం మూసివేత రాజగోపురం వద్దనే పూజలు.. నిండుతున్న సింగూరు ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో పొంగి పొర్లుతున్న మోయతుమ్మెద వాగు రాక పోకలు బంద్. విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: గత రెండు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా 10 సెంటి మీటర్ల పైనే వర్షం కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:30 AM IST
Medak | భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న ఘనపూర్ (వనదుర్గా) ప్రాజెక్టు

Medak

  • ఏడుపాయల వన దుర్గామాత ఆలయం మూసివేత
  • రాజగోపురం వద్దనే పూజలు..
  • నిండుతున్న సింగూరు ప్రాజెక్టు
  • సిద్దిపేట జిల్లాలో పొంగి పొర్లుతున్న మోయతుమ్మెద వాగు
  • రాక పోకలు బంద్.

విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: గత రెండు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా 10 సెంటి మీటర్ల పైనే వర్షం కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సింగూరు ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. దిగువకు నీటిని వదలడంతో దిగువన మంజీర పరవళ్ళు తొక్కుతుంది.

మెదక్ జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజక్టు ఘనపూర్ (వనదుర్గ) ప్రాజెక్టు పొంగి పొర్లుతుoది. ఏడుపాయల వన దుర్గామాత ఆలయం నీట మునిగింది. దీంతో రాజగోపురం వద్దనే పూజలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా లో మోయతుమ్మెద వాగు కూడా పొంగి పొర్లుతుంది.

రహదారిపై నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారులను వెంట పెట్టుకొని మెదక్ లో పర్యటించి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు జిల్లాలోని వాగులు, వంకలన్ని తాజా వర్షాలు, వరదలతో పొంగి ప్రవహిస్తున్నాయి.