స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి

విధాత: సూర్యాపేట జిల్లా కోమటికుంట తండాలో స్కూల్ బస్సు కింద పడి బాలిక నైనిక(3)మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తు ధర్నా నిర్వహించారు. ఒక్కో స్కూల్ బస్సులో 50 మందికి పైగా తరలిస్తున్నారని, వారు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కనీసం ఒక ఆయాను అయినా పర్యవేక్షణ కు పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి

విధాత: సూర్యాపేట జిల్లా కోమటికుంట తండాలో స్కూల్ బస్సు కింద పడి బాలిక నైనిక(3)మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తు ధర్నా నిర్వహించారు.

ఒక్కో స్కూల్ బస్సులో 50 మందికి పైగా తరలిస్తున్నారని, వారు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కనీసం ఒక ఆయాను అయినా పర్యవేక్షణ కు పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.