21 ఏండ్ల యువ‌తిపై ఆరు సార్లు క‌త్తితో దాడి (వీడియో)

విధాత: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో దారుణం జ‌రిగింది. త‌న‌తో మాట్లాడటం లేద‌నే అక్క‌సుతో ఓ యువ‌తిని క‌త్తితో పొడిచాడు. అనంత‌రం అక్క‌డ్నుంచి పారిపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఆద‌ర్శ‌న‌గ‌ర్‌కు చెందిన సుఖ్వింద‌ర్‌కు, ఓ యువ‌తితో కొన్నేండ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. ఈ ప‌రిచ‌యం కాస్త స్నేహంగా మారింది. కాగా గ‌త కొంత‌కాలం నుంచి స‌ద‌రు యువ‌తి, సుఖ్వింద‌ర్‌తో మాట్లాడ‌టం మానేయడంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన సుఖ్వింద‌ర్‌, ఆ యువ‌తిని ఒంట‌రిగా దొరికించుకుని, క‌త్తితో పొడిచి చంపాడు. […]

  • By: krs    latest    Jan 04, 2023 9:43 AM IST
21 ఏండ్ల యువ‌తిపై ఆరు సార్లు క‌త్తితో దాడి (వీడియో)

విధాత: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో దారుణం జ‌రిగింది. త‌న‌తో మాట్లాడటం లేద‌నే అక్క‌సుతో ఓ యువ‌తిని క‌త్తితో పొడిచాడు. అనంత‌రం అక్క‌డ్నుంచి పారిపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఆద‌ర్శ‌న‌గ‌ర్‌కు చెందిన సుఖ్వింద‌ర్‌కు, ఓ యువ‌తితో కొన్నేండ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది.

ఈ ప‌రిచ‌యం కాస్త స్నేహంగా మారింది. కాగా గ‌త కొంత‌కాలం నుంచి స‌ద‌రు యువ‌తి, సుఖ్వింద‌ర్‌తో మాట్లాడ‌టం మానేయడంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన సుఖ్వింద‌ర్‌, ఆ యువ‌తిని ఒంట‌రిగా దొరికించుకుని, క‌త్తితో పొడిచి చంపాడు. ఆమెపై ఆరు సార్లు క‌త్తితో దాడి చేసి పారిపోయాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం బాబు జ‌గ్జీవ‌న్ రామ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అంబాలాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.