Nirmal | పంచాయతీ పరిధిలో.. ప్రభుత్వ భూములు అమ్ముకునే అవకాశం ఇవ్వండి: సర్పంచ్
ఆ డబ్బుతో పంచాయతీ అభివృద్ధి చేస్తాం మండల సమావేశంలో సర్పంచ్ డిమాండ్ Nirmal | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వెచ్చించిన నిధులు ప్రభుత్వం నుంచి రావడంలేదు. అందుకే గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ బంజరు భూములు అమ్ముకొనే అవకాశాన్ని కల్పించాలి’ అంటూ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లి (హెచ్) గ్రామ సర్పంచ్ రాజేందర్ కుబీర్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో సర్పంచ్ నేలపై కూర్చుని […]

- ఆ డబ్బుతో పంచాయతీ అభివృద్ధి చేస్తాం
- మండల సమావేశంలో సర్పంచ్ డిమాండ్
Nirmal | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వెచ్చించిన నిధులు ప్రభుత్వం నుంచి రావడంలేదు. అందుకే గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ బంజరు భూములు అమ్ముకొనే అవకాశాన్ని కల్పించాలి’ అంటూ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లి (హెచ్) గ్రామ సర్పంచ్ రాజేందర్ కుబీర్ డిమాండ్ చేశారు.
బుధవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో సర్పంచ్ నేలపై కూర్చుని నిరసన తెలియజేశాడు. తమ గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం సక్రమంగా నిధులు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఎస్ఎఫ్సీ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చిన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేశారని, ప్రభుత్వం నుండి నిధులు రాక బయట నుండి తెచ్చిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతినెలా గ్రామపంచాయతీ నిర్వహణ, ట్రాక్టర్ మెయింటినెన్స్, పారిశుధ్య కార్మికుల వేతనాలు తదితర ఖర్చులకు ప్రభుత్వం తరహాలో కోకాపేట భూములు అమ్ముకున్న మాదిరిగానే గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
సర్పంచ్ సరికొత్త వాదం
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అమ్మేస్తోంది. అదేమాదిరి గ్రామ పంచాయతీల అభివృద్ధి, నిర్వహణ కోసం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ బంజరు భూములను అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సర్పంచ్.. సరికొత్త వాదాన్ని ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తెరపైకి తెచ్చారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచులు అప్పులు తెచ్చి, అభివృద్ధి చేసి ఏళ్లు గడుస్తున్నా… చేసిన పనులకు నిధులు రావడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోయి గ్రామస్థాయిలో పరువు పోతోంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
గ్రామపంచాయతీ పారిశుధ్య నిర్వహణ, ఇతర పనుల కోసం సొంత డబ్బులు వెచ్చించినప్పటికీ ఆ నిధులు రాక సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే ప్రభుత్వ భూములను అమ్ముకునే అవకాశం కల్పించాలని సర్పంచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.