ప్రభుత్వాన్ని పడగొట్టాలని.. దేవుడు మోదీకి సిగ్నల్ ఇచ్చాడా?: మంత్రి హరీశ్ రావు
విధాత, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ ప్రజలు స్వచ్ఛందంగా కాలి నడకన సభకు వచ్చి ఆశీర్వదించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిన్నటి సభతో గెలుపు టీఆర్ఎస్దే అని స్పష్టమయిందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టి మనుషుల్లో కృతజ్ఞత భావం ఉంటుందని, తమకు సాయం చేసిన వారికి అండగా ఉంటామని నిన్నటి సభ ద్వారా రుజువు యిందని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు […]

విధాత, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ ప్రజలు స్వచ్ఛందంగా కాలి నడకన సభకు వచ్చి ఆశీర్వదించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిన్నటి సభతో గెలుపు టీఆర్ఎస్దే అని స్పష్టమయిందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టి మనుషుల్లో కృతజ్ఞత భావం ఉంటుందని, తమకు సాయం చేసిన వారికి అండగా ఉంటామని నిన్నటి సభ ద్వారా రుజువు యిందని అన్నారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్వి నకిలీ, మకిలీ మాటలని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్ఏగా మారిందన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏం చేశామో నిరూపిస్తామని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని అన్నారు. కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు రావడం లేదన్నారు. అత్యధికంగా రైతుబంధు లబ్ధి పొందిన నియోజకవర్గం మునుగోడు అని మంత్రి తెలిపారు.
చేనేత జీఎస్టీపై బీజేపీ అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టిన మంత్రి శ్రీ @trsharish #RollbackHandloomGST pic.twitter.com/bf1JGVw9fH
— TRS Party (@trspartyonline) October 31, 2022
ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేతల మాటలు వింటే ప్రజలు నమ్మకం కోల్పోతారు. పచ్చి అబద్దాలు మాట్లాడారు. సాక్షాధారాలతో నేను మాట్లాడుతున్నా. సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ 8 ఏళ్లలో ఏం చేయలేదు. 15 రోజుల్లో చేస్తరని అంటున్నడు. పోదం పద మునుగోడుకు. 99 శాతం మునుగోడు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలు అందాయి. ఏ అక్కను అడిగినా, చెల్లెనడిగినా చెబుతుంది శుద్ధి చేసిన కృష్ణా నీరు ఇంటింటికి అందుతుందని. మొన్న ఒక్క చెల్లే చెబుతోంది నాలుగేళ్లు అయింది భుజం మీద బిందెలు ఎత్తుకోవడం మానేశానని.
మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నరు. వందల కోట్ల ఆస్తి చూపినా వారు గడ్డిపోచలా వదులుకుని రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డారు. రాజ్యాంగ నిబంధనల మేరకు వాళ్లు మా పార్టీలో విలీనమయ్యారు తప్ప మీలా ప్రభుత్వాలను కూలగొట్ట లేదు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వళ్లించడమే.
ఈడీలను, బోడీలను చూపించి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటరు. ప్రభుత్వాలు పడగొడ్తరు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లను మీరు విలీనం చేసుకున్నరు కదా. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో విలీనం అయితే తప్పేంటి. మీరు విలీనం చేసుకోవచ్చు. మేం చేస్తే తప్పా’’
గుజరాత్ లో 8 మంది ఎమ్మెల్యేలు, సిక్కింలో 13 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నరు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, సిక్కిం ఇలా 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూల గొట్టిండ్రు. మీరు రాజకీయాల కోసం మాట్లాడతరా. మీకు నైతిక హక్కు ఉందా అని నిలదీశారు. బెంగాల్లో బ్రిడ్జి కూలిపోతే అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చాడని ప్రధాని మోదీ అన్నారు.
అయితే.. ఇప్పుడు గుజరాత్లో తీగల వంతెన పడిపోయింది.. మరి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు సిగ్నల్ ఇచ్చాడనుకోవాలా?’’ అని సెటైర్లు విసిరారు. తాము ప్రజల డబ్బుతో నీళ్లు లిఫ్ట్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని యెద్దేవా చేశారు. స్వామిజీలు ఎవరో తమకు తెలియదని బీజేపీ నాయకులు అంటున్నారని… మరి కేసులు ఎందుకు వేశారని మంత్రి ప్రశ్నించారు.
పాయింట్- 5 ఎఫ్ఆర్బీఎమ్ నిధులు ఇవ్వాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెట్టారని… పాయింట్- 5 అంటే ఏడాదికి 6 వేల కోట్లు.. ఐదేళ్ళకు 30 వేల కోట్లు ఇస్తారని చెప్పారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు పెట్టే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం 30 వేల కోట్లు కేసీఆర్ వదులుకున్నారని తెలిపారు. రెండేళ్లలో కలిపి కేంద్రం రూ.12 వేల కోట్లను ఆపిందని హరీష్‌రావు చెప్పారు.
మోటర్లకు మీటర్లు పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పింది నిజం కాదా బండి సంజయ్ ?#MunugodeBypoll #VoteForCar pic.twitter.com/9CftVQs9hh
— Varun Thakkallapalli (@varuntrs58) October 31, 2022
1
చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును లెక్కచేయడం లేదన్నారు. రూ.1900 కోట్లు ఇవ్వాలంటే 19 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ గర్ జల్ కింద 50% నిధులు ఇవ్వలేదని.. కిషన్‌రెడ్డి తీసుకురావాలని హరీష్ డిమాండ్ చేశారు.