Gold Rate | కొనుగోలుదారులకు షాక్‌..! మళ్లీ రూ.56వేలు దాటిన పుత్తడి ధర.. హైదరాబాద్‌లో ఎంత ఉందంటే..?

Gold Rate | బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. నిన్నా మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి ధరలు.. ఆదివారం భారీగా పెరిగింది. 22 క్యారెట్ల తులం బంగారంపై ఒకేసారి రూ.500 పెరిగి.. ప్రస్తుతం రూ.56,300 వద్ద కొనసాగుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడిపై రూ.550 పెరిగి.. రూ.61,420కి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం […]

Gold Rate | కొనుగోలుదారులకు షాక్‌..! మళ్లీ రూ.56వేలు దాటిన పుత్తడి ధర.. హైదరాబాద్‌లో ఎంత ఉందంటే..?

Gold Rate |

బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. నిన్నా మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి ధరలు.. ఆదివారం భారీగా పెరిగింది. 22 క్యారెట్ల తులం బంగారంపై ఒకేసారి రూ.500 పెరిగి.. ప్రస్తుతం రూ.56,300 వద్ద కొనసాగుతున్నది.

అదే సమయంలో 24 క్యారెట్ల పసిడిపై రూ.550 పెరిగి.. రూ.61,420కి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,570 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.56,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ.61,470 వద్ద ట్రేడవుతున్నది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,960 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,470 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.56,300 ఉన్నది. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,420 వద్ద ట్రేడవుతున్నది. ఏపీలో విజయవాడ, విశాఖపట్నంతో సహా తెలుగు రాష్ట్రాలంతటా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండి సైతం కిలోకు రూ.1000 పెరిగి రూ.75,3000కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79వేలు పలుకుతోంది. మరో వైపు ప్లాటీనం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం ప్లాటినం రూ.28,360 ధర పలుకుతున్నది.