Gold Rate | మళ్లీ పెరిగిన బంగారం..! హైదరాబాద్‌లో నేడు ధర ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి.. రూ.54,150కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై సైతం రూ.100 పెరగ్గా.. తులం రేటు రూ.59,060 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.59,220కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,150 […]

Gold Rate | మళ్లీ పెరిగిన బంగారం..! హైదరాబాద్‌లో నేడు ధర ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి.. రూ.54,150కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై సైతం రూ.100 పెరగ్గా.. తులం రేటు రూ.59,060 పలుకుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.59,220కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,150 ఉండగా.. రూ.59,060కి పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల రూ.59,060కి చేరింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,060కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పలు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు పెరిగిన క్రమంలో వెండి ధర సైతం పెరిగింది.

నిన్న కిలోకు రూ.200 వరకు తగ్గతా.. తాజాగా రూ.300 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.75,800 వద్ద కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1927 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ ధర 23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.015 వద్ద కొనసాగుతున్నది.