Gold Rate | మగువలకు షాక్..! మరోసారి పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?
Gold Rate | బంగారం ధరలు మహిళలకు షాక్‌నిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం(Gold) ధరలు శనివారం పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.340 వరకు పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,250 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.61,100 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల […]

Gold Rate | బంగారం ధరలు మహిళలకు షాక్‌నిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం(Gold) ధరలు శనివారం పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.340 వరకు పెరుగుదల నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,250 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.61,100 పలుకుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,380 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,505 వద్ద కొనసాగుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,050 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,150 వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,100 పలుకుతున్నది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
నిన్న భారీగా తగ్గిన వెండి ధర సైతం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,600 పలుకుతున్నది.