Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం.. మరి దేశంలో ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం త్వరలో జరుగనున్నది. సమావేశానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. మరో వైపు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.59,840 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లోనే ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద […]

Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం.. మరి దేశంలో ఎలా ఉన్నాయంటే..?

Gold Rate |

అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం త్వరలో జరుగనున్నది. సమావేశానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది.

మరో వైపు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.59,840 పలుకుతున్నది.

దేశంలోని వివిధ నగరాల్లోనే ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద కొనసాగుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,110 వద్ద స్థిరంగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,840 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77వేలుగా ఉన్నది.