Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? ధర తగ్గింది త్వరపడండి మరి..!

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గి.. రూ.54,700 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 తగ్గి.. 59,670కి తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,820కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర […]

Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? ధర తగ్గింది త్వరపడండి మరి..!

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గి.. రూ.54,700 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 తగ్గి.. 59,670కి తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,820కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,670కి చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి​ ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,050 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,20 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,670 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.900 తగ్గగా.. కిలో రూ.73,100కి పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75,500కి తగ్గింది.