Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడికి డిమాండ్.. దేశంలో పెరిగిన బంగారం ధరలు..! హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | అంతర్జాతీ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుతున్నది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందా ? లేదా అనే సందిగ్ధ పరిస్థితుల్లో పుత్తడికి డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఔన్స్‌కు బంగారం 1953 డాలర్లు పలుకుతున్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. దీంతో శనివారం దేశంలోని బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి.. తులం రూ.55వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.110 పెరిగి రూ.60వేలకు పెరిగింది. వివిధ […]

Gold Rates |
అంతర్జాతీ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుతున్నది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందా ? లేదా అనే సందిగ్ధ పరిస్థితుల్లో పుత్తడికి డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఔన్స్‌కు బంగారం 1953 డాలర్లు పలుకుతున్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది.
దీంతో శనివారం దేశంలోని బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి.. తులం రూ.55వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.110 పెరిగి రూ.60వేలకు పెరిగింది.
వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,150 పలుకుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,330కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేలకు చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేలుగా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60వేలు పలుకుతున్నది.
మరో వైపు కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500 పలుకుతున్నది.