Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ధరలు భారీ ఊరట కలిగించాయి. వెండిపై ఒకే రోజు కిలోకు రూ.2వేలకు పైగా పతనమైంది. బంగారంపై 160 వరకు తగ్గింది. బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. నిన్న వెండిపై రూ.700 వరకు తగ్గింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.3వేల వరకు దిగివచ్చి కిలోకు రూ.75వేలకు చేరింది. 22 గ్రాముల తులం బంగారంపై రూ.150 తగ్గి రూ.54,950 పలుకుతున్నది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.160 వరకు తగ్గి రూ.59,950కి […]
Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ధరలు భారీ ఊరట కలిగించాయి. వెండిపై ఒకే రోజు కిలోకు రూ.2వేలకు పైగా పతనమైంది. బంగారంపై 160 వరకు తగ్గింది. బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. నిన్న వెండిపై రూ.700 వరకు తగ్గింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.3వేల వరకు దిగివచ్చి కిలోకు రూ.75వేలకు చేరింది.
22 గ్రాముల తులం బంగారంపై రూ.150 తగ్గి రూ.54,950 పలుకుతున్నది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.160 వరకు తగ్గి రూ.59,950కి చేరింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,100 ఉండగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.60,100 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,950కి చేరింది. చెన్నైలో చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,350 ఉండగా. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,380కి తగింది.
ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసడి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.2300 తగ్గి రూ.75వేలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి రూ.78,500 పలుకుతున్నది.