Gold Rates | సామాన్యులకు షాక్‌.. పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌ పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగింది. మరో వైపు 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,400కి చేరింది. 24 క్యారెట్ల తులం పుత్తడి రూ.59,330కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,250గా ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,180 వద్ద కొనసాగుతున్నది. […]

Gold Rates | సామాన్యులకు షాక్‌.. పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌ పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగింది.

మరో వైపు 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,400కి చేరింది. 24 క్యారెట్ల తులం పుత్తడి రూ.59,330కి ఎగిసింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,250గా ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,180 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.59,180కి చేరింది.

ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,180 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,250కి పెరిగింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.500 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.74,500 మార్క్ వద్ద ట్రేడవుతున్నది.