Gold Rate | మహిళలకు షాక్‌ ఇస్తున్న బంగారం.. భారీగా పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో రూ.60వేలకు దగ్గరగా..!

Gold Rate | వినియోగదారులకు బంగారం ధరలు షాక్‌ ఇస్తున్నాయి. మార్కెట్‌లో పసడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై ఒకే రోజు రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం రూ.54,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరిగి.. తులానికి రూ.59,510కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,660కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,550 ఉండగా.. 24 […]

Gold Rate | మహిళలకు షాక్‌ ఇస్తున్న బంగారం.. భారీగా పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో రూ.60వేలకు దగ్గరగా..!

Gold Rate |

వినియోగదారులకు బంగారం ధరలు షాక్‌ ఇస్తున్నాయి. మార్కెట్‌లో పసడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై ఒకే రోజు రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం రూ.54,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరిగి.. తులానికి రూ.59,510కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,660కి పెరిగింది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,510కి చేరింది. బెంగళూరులోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,940 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,510కి చేరింది.

తెలంగాణలోని పలు నగరాలతో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.76,700 పలుకుతున్నది.