Gold Rates | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? త్వరపడండి మరి.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నా మొన్న పెరుగుతూ వచ్చిన వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నది. మరో వైపు గత మూడు రోజులుగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ ప్రాంత్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,150 పలుకుతున్నది. […]

Gold Rates | బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నా మొన్న పెరుగుతూ వచ్చిన వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నది. మరో వైపు గత మూడు రోజులుగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ ప్రాంత్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,150 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60వేలు ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,50 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81,800 ఉన్నది.