Gold Rates | మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర..! మళ్లీ తులానికి రూ.60వేలకు చేరువలో..!
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బుధవారం స్థిరంగా కొనసాగిన ధరలు.. బులియన్ మార్కెట్‌లో గురువారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసడిపై రూ.200 పెరిగి.. రూ.54,650కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.210 పెరిగి.. రూ.59,620కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,770కి పెరిగింది. ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. […]

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బుధవారం స్థిరంగా కొనసాగిన ధరలు.. బులియన్ మార్కెట్‌లో గురువారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసడిపై రూ.200 పెరిగి.. రూ.54,650కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.210 పెరిగి.. రూ.59,620కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,770కి పెరిగింది. ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,620 వద్ద కొనసాగుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60వేలకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,620కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,620 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుమల నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర సైతం పెరిగింది. కిలో వెండిపై రూ.200 పెరిగి కిలో రూ.73,600 పలుకుతున్నది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ..77వేలకు ఎగిసింది.