Gold Rates | పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు..! నేడు హైదరాబాద్ మార్కెట్‌లో ఇలా..!
Gold Rates | ఇటీవల బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్‌లో సోమవారం ధరలు పెరగ్గా.. మంగళవారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో పుత్తడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,410 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.59,560 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి […]

Gold Rates | ఇటీవల బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్‌లో సోమవారం ధరలు పెరగ్గా.. మంగళవారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో పుత్తడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,410 పలుకుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.59,560 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,410 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల పసడి ధర రూ.54,820 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,800 వద్ద స్థిరంగా ఉన్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.59,410గా ఉన్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,410 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,100 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతున్నాయి.