మగువలకు బిగ్ రిలీఫ్..! భారీగా పతనమైన బంగారం ధర..!
కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో శుక్రవారం భారీగా తగ్గుముఖం పట్టాయి

విధాత: కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో శుక్రవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.600 తగ్గగా.. తులానికి రూ.57,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.650 తగ్గి తులానికి రూ.62,730కి దిగివచ్చింది. ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.58,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,980 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,730కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.57,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,880కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,730 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82,200 పలుకుతున్నది.