బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌కే సొరంగం.. రూ. కోటి విలువైన బంగారం దోపిడీ

Uttar Pradesh | బ్యాంకులో ఉన్న బంగారాన్ని, న‌గ‌దును దోచుకునేందుకు దొంగ‌లు చేసిన ప్లాన్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే. దోపిడీ చేసేందుకు ఏకంగా 10 అడుగుల మేర సొరంగం త‌వ్వి.. బ్యాంకు లాక‌ర్ గ‌దిలోకి ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత దొరికినకాడికి దోచుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాన్పూర్ ప‌రిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భ‌నుతి బ్రాంచి అధికారులు శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకును తెరిచారు. లాక‌ర్ రూం వ‌ద్దకు వెళ్లి చూడ‌గా సొరంగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన […]

బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌కే సొరంగం.. రూ. కోటి విలువైన బంగారం దోపిడీ

Uttar Pradesh | బ్యాంకులో ఉన్న బంగారాన్ని, న‌గ‌దును దోచుకునేందుకు దొంగ‌లు చేసిన ప్లాన్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే. దోపిడీ చేసేందుకు ఏకంగా 10 అడుగుల మేర సొరంగం త‌వ్వి.. బ్యాంకు లాక‌ర్ గ‌దిలోకి ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత దొరికినకాడికి దోచుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాన్పూర్ ప‌రిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భ‌నుతి బ్రాంచి అధికారులు శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకును తెరిచారు. లాక‌ర్ రూం వ‌ద్దకు వెళ్లి చూడ‌గా సొరంగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బ్యాంకు సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు సొరంగం త‌వ్విన మార్గాన్ని ప‌రిశీలించారు. బ్యాంకు ప‌క్క‌నే ఉన్న ఖాళీ స్థ‌లం నుంచి సొరంగం త‌వ్వి లాక‌ర్ గ‌దిలోకి ప్ర‌వేశించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇక లాక‌ర్ల‌ను ప‌గుల‌గొట్టిన దొంగ‌లు.. 1.8 కిలోల బంగారాన్ని అప‌హ‌రించారు. ఈ బంగారం విలువ రూ. కోటి పైనే ఉంటుంద‌ని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు. మ‌రో లాక‌ర్‌ను కూడా ప‌గుల‌గొట్టేందుకు యత్నించ‌గా వీలు కాలేదు. ఆ లాక‌ర్‌లో రూ. 32 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆధారాల‌ను సేక‌రించారు. బ్యాంకు నిర్మాణం గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.