ఒకే గుడిలో ఎదురుపడ్డ గవర్నర్, ఎమ్మెల్సీ కవిత
విధాత: అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, గవర్నర్ తమిళిసైల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం పచ్చగడ్డి వేసినా మండేలా ఉన్నాయి. సీఎం మొదలు మంత్రుల ద్వారా గవర్నర్ పై విరుచుకు పడిన సందర్భాలున్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ ఒకే గుడిలో ఎదురుపడ్డారు. శంషాబాద్ అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి ఆలయంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. అయితే కవితతో బతుకమ్మ ఆడేందుకు గవర్నర్ నిరాకరించారు. టీఆర్ఎస్ శాసన […]

విధాత: అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, గవర్నర్ తమిళిసైల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం పచ్చగడ్డి వేసినా మండేలా ఉన్నాయి. సీఎం మొదలు మంత్రుల ద్వారా గవర్నర్ పై విరుచుకు పడిన సందర్భాలున్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ ఒకే గుడిలో ఎదురుపడ్డారు.
శంషాబాద్ అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి ఆలయంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. అయితే కవితతో బతుకమ్మ ఆడేందుకు గవర్నర్ నిరాకరించారు.
టీఆర్ఎస్ శాసన సభ్యులు, కవిత గవర్నర్‌ను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనమని కోరారు. కానీ తరువాతి ప్రోటోకాల్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాలపై అధికారుల్లో కొంత ఆందోళన వ్యక్తమైనా తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.