లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ గవర్నర్ తమిళసై శుక్రవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌కు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం గవర్నర్‌కు అర్చక పండితులు మహాదాశిర్వాచనం చేసి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం గవర్నర్ హైద‌రాబాద్‌లోని రాజ్‌భవన్ కి తిరిగి వెళ్లారు.

లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ గవర్నర్ తమిళసై శుక్రవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌కు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం గవర్నర్‌కు అర్చక పండితులు మహాదాశిర్వాచనం చేసి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం గవర్నర్ హైద‌రాబాద్‌లోని రాజ్‌భవన్ కి తిరిగి వెళ్లారు.