గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడటానికి ఏమున్నది? భట్టి

విధాత‌: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, యువత, రైతుల సమస్యల పై చర్చ జరగాలని మా పార్టీ తరపున కోరామని తెలిపారు. బడ్జెట్‌పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజులు చర్చ జరగాలన్నారు. అప్పుడే సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం 25 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరగాలని బీఏసీ సమావేశంలో మాపార్టీ […]

గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడటానికి ఏమున్నది? భట్టి

విధాత‌: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, యువత, రైతుల సమస్యల పై చర్చ జరగాలని మా పార్టీ తరపున కోరామని తెలిపారు.

బడ్జెట్‌పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజులు చర్చ జరగాలన్నారు. అప్పుడే సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం 25 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరగాలని బీఏసీ సమావేశంలో మాపార్టీ తరఫున కోరామని పేర్కొన్నారు.

బీఏసీ ప్రతిపక్షాలన్నింటినీ పిలిస్తే బాగుంటుందని భట్టి అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంపై స్పందించాలని విలేకరులు కోరగా.. దానిపై కామెంట్‌ చేయడానికి ఏమున్నది? రాష్ట్ర ప్రజలు ఎదురుచూసేవి ఏమీ లేవన్నారు. అది మామూలు ప్రసంగం మాత్రమే అన్నారు.