గౌడన్నల ఆహ్వానం.. కల్లు తాగిన మంత్రి ఎర్రబెల్లి

కాటమయ్య గుడి సందర్శన ఆల‌యాల‌న్నిటికి ప్ర‌హ‌రీలు నిర్మిస్తాన‌ని హామీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గౌడుల ఆహ్వానం మేరకు రేఖ పట్టి కల్లు తాగి వారిని సంతృప్తి పరిచారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కల్లు తాగుతూ గీతన్నలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి గూడెంలో శనివారం ఈ సంఘటన జరిగింది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం పెద్దమ్మ గుడి, గంగ దేవమ్మ గుడి, బీరప్ప గుడి […]

గౌడన్నల ఆహ్వానం.. కల్లు తాగిన మంత్రి ఎర్రబెల్లి
  • కాటమయ్య గుడి సందర్శన
  • ఆల‌యాల‌న్నిటికి ప్ర‌హ‌రీలు నిర్మిస్తాన‌ని హామీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గౌడుల ఆహ్వానం మేరకు రేఖ పట్టి కల్లు తాగి వారిని సంతృప్తి పరిచారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కల్లు తాగుతూ గీతన్నలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి గూడెంలో శనివారం ఈ సంఘటన జరిగింది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు.

అనంతరం పెద్దమ్మ గుడి, గంగ దేవమ్మ గుడి, బీరప్ప గుడి భక్తులు మంత్రి దగ్గరికి వచ్చి తమ గుడి వద్దకు ఆహ్వానించారు. కంఠమహేశ్వర స్వామి గుడికి గౌడ సోదరులు మంత్రిని రమ్మన్నారు. వాటిని పరిశీలించి ప్రతీ గుడికి ప్రహరీ గోడ కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సంతోషంతో కల్లు తాగమని మంత్రిని కోరారు. గీతన్నలతో కలిసి కల్లు తాగి , మంత్రి వారితో సంతోషం పంచుకున్నారు.