ప్రాగ్ వ‌ర్సిటీలో కాల్పులు 14 మంది మృతి

చెక్‌ రిపబ్లిక్‌ రాజధానిలోని ప్రాగ్ యూనివ‌ర్సిటీలో సాయుధుడు జ‌రిపిన కాల్పుల్లో 14 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 14 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు.

ప్రాగ్ వ‌ర్సిటీలో కాల్పులు 14 మంది మృతి
  • మ‌రో 25 మంది విద్యార్థుల‌కు గాయాలు
  • తొలుత తండ్రిని కాల్చి చంపిన దుండ‌గుడు
  • సాయుధుడిగా యూనివ‌ర్సిటీకి వ‌చ్చిన‌
  • విద్యార్థి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు
  • చివ‌రికి త‌న‌ను తాను కాల్చుకొని సూసైడ్‌


విధాత‌: చెక్‌ రిపబ్లిక్‌ రాజధానిలోని ప్రాగ్ యూనివ‌ర్సిటీలో సాయుధుడు జ‌రిపిన కాల్పుల్లో 14 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 14 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. గురువారం 24 ఏళ్ల చెక్ విద్యార్థి తొలుత తన తండ్రిని కాల్చి చంపాడు. ఆపై తాను చ‌దువుతున్న ప్రాగ్‌ విశ్వవిద్యాలయంలోని ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ భవనంలోకి చొర‌బ‌డ్డాడు. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. కాల్పుల శ‌బ్ధం విన్న ప‌లువురు విద్యార్థులు దాక్కున్నారు.


దుండ‌గుడి కాల్పుల్లో 14 మంది చనిపోగా, గాయ‌ప‌డిన 25 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. చెక్ రిపబ్లిక్ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘ‌ట‌న‌గా ఇది నిలిచింది. చివ‌రి సాయుధుడు త‌న‌ను తాను కాల్చుకొని చ‌నిపోయిన‌ట్టు పోలీసులు తెలిపారు. అత‌డి వ‌ద్ద ఉన్న ఆయుధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


యునివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధం లేదని చెక్‌ రిపబ్లిక్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ విట్‌ రాకుసన్‌ తెలిపారు. మృతుల‌ను స్మరించుకునేందుకు ప్రభుత్వం శ‌నివారాన్ని సెంట్రల్ యూరోప్ దేశమంతటా సంతాప దినంగా ప్రకటించింది. ప్రెసిడెంట్ పీటర్ పావెల్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ప్రత్యేక క్యాబినెట్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది.