సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేంరెడ్డితో అమిత్‌రెడ్డి భేటీ

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మంగళవారం

సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేంరెడ్డితో అమిత్‌రెడ్డి భేటీ

కాంగ్రెస్‌లో చేరికకు సన్నద్ధం

భువనగిరి ఎంపీ టికెట్ చాన్స్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మంగళవారం సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆరెస్ నుంచి నల్గొండ, భువనగిరి స్థానాల ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కెదురవ్వడంతో అసంతృప్తి చెందిన ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో తన చేరికకు సంబంధించి ఇప్పటికే ఆయన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీయైన అమిత్‌రెడ్డి ఇప్పుడు సీఎం సహాలదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. గుత్తా అమిత్‌రెడ్డికి భువనగిరి ఎంపీ స్థానం టికెట్ ఇచ్చే అవకశామున్నట్లుగా సమాచారం. బీఆరెస్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి తన వర్గీయులైన మాజీ ఎమ్మెల్యేలతో కలిసి గుత్తా అమిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వోద్దంటు అధినేత కేసీఆర్ వద్ద తమ గళం వినిపించారు. దీంతో చేసేది లేక అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.