Half day school | తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ఉత్తర్వులు

Half day school | వేసవికాలం నేపథ్యం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో ఒంటిపూట బడి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒక పూట విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటిని సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. ఇక ఏడాది ఏప్రిల్‌ […]

Half day school | తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ఉత్తర్వులు

Half day school | వేసవికాలం నేపథ్యం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో ఒంటిపూట బడి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒక పూట విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటిని సౌకర్యం కల్పించాలని ఆదేశించింది.

ఇక ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి. మిగతా తరగతి విద్యార్థులకు అదే నెల 12 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.

ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో 17వ తేదీ వరకు పరీక్షలు ముగియనున్నాయి. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 21న ఫలితాలు వెల్లడి, 24న అన్ని పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించి.. 25వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.