Hanumakonda | హనుమకొండలో గాయత్రి హాస్పిటల్ సీజ్

Hanumakonda అనుమతిలేకుండా అబార్షన్‌లు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనుమతులు లేకుండా అబార్షన్లను నిర్వహిస్తున్నారని హనుమకొండ కాకాజీ కాలనీలోని గాయత్రి హాస్పిటల్ ను వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. క్రైమ్ నెంబర్134/2023 మేరకు జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో గాయత్రి హాస్పిటల్ ని సోదా చేసి అందుబాటులో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకొని హాస్పటల్ ని సీజ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం […]

Hanumakonda | హనుమకొండలో గాయత్రి హాస్పిటల్ సీజ్

Hanumakonda

  • అనుమతిలేకుండా అబార్షన్‌లు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనుమతులు లేకుండా అబార్షన్లను నిర్వహిస్తున్నారని హనుమకొండ కాకాజీ కాలనీలోని గాయత్రి హాస్పిటల్ ను వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు.

క్రైమ్ నెంబర్134/2023 మేరకు జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో గాయత్రి హాస్పిటల్ ని సోదా చేసి అందుబాటులో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకొని హాస్పటల్ ని సీజ్ చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యాకుబ్ పాషా, మడికొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి వేణు, సబ్ ఇన్స్పెక్టర్ ఈ. నరసింహారావు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, సిహెచ్ ఓ మాధవరెడ్డి, హనుమకొండ గిరిదావర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.