హనుమాన్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ.. గూస్‌ బంప్స్‌ ఖాయం

టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. హనుమాన్ మూవీకి సంబందించిన ఫస్ట్ రిహ్యూ వచ్చేసింది.

  • By: Somu    latest    Jan 11, 2024 11:39 AM IST
హనుమాన్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ.. గూస్‌ బంప్స్‌ ఖాయం

విధాత: టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. హనుమాన్ మూవీకి సంబందించిన ఫస్ట్ రిహ్యూ వచ్చేసింది. విడుదలకు ముందురోజు గురువారం దేశ వ్యాప్తంగా 350ప్రీమియర్‌ షోలు ప్రదర్శించగా అంతటా హౌజ్‌ ఫుల్‌గా హనుమాన్‌ మూవీ ప్రదర్శితమైంది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రం హిందీ షో చూసి తన రివ్యూను ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌ అందించాడన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్ బంప్స్ ఖాయమన్నాడు.


ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది.


అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ఒక్క రోజు తేడాలో ఈనెల 13న సీనియర్‌ హీరో వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌, మరుసటి రోజు 14వ తేదీన నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలు విడుదలవుతున్నాయి. కాగా హనుమాన్‌ సినిమాకి సంబంధించి ప్రతి టికెట్‌ ధరలో 5రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళంగా అందిస్తుండటం విశేషం.