ఆ నాలుగు వదిలేస్తే.. సంతోషం మీ వెంటే..
విధాత: సంతోషం అనేది అసలు ఎలా వస్తుంది..? ఎలా ఉంటుంది..? సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి..? చాలా మంది సంతోషాన్ని ఏదో ఒక అంశంలో వెదుకుతారు. మరి కొంతమంది చిన్న సమస్యకే ఆందోళన చెందుతారు. తనకే అన్ని కష్టాలు అని మదనపడుతూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి పరిస్థితిలోనైనా మనం సంతోషంగా గడపాలంటే అందుకు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముందుగా మనం చేయాల్సింది నాలుగు విషయాలను వదిలేయడం. అవేమిటో తెలుసుకుందాం. గొప్పలు చెప్పుకోవడం.. చాలా […]

విధాత: సంతోషం అనేది అసలు ఎలా వస్తుంది..? ఎలా ఉంటుంది..? సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి..? చాలా మంది సంతోషాన్ని ఏదో ఒక అంశంలో వెదుకుతారు. మరి కొంతమంది చిన్న సమస్యకే ఆందోళన చెందుతారు. తనకే అన్ని కష్టాలు అని మదనపడుతూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి పరిస్థితిలోనైనా మనం సంతోషంగా గడపాలంటే అందుకు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముందుగా మనం చేయాల్సింది నాలుగు విషయాలను వదిలేయడం. అవేమిటో తెలుసుకుందాం.
గొప్పలు చెప్పుకోవడం..
చాలా మందికి ఎవరి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం, తమను తామే పొగుడుకోవడం అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచిది కాదు. దీని వల్ల మనిషిలో అహం పెరిగిపోతుంది. తామే గొప్ప అనుకోవడం వల్ల ఇతరులను చులకనగా చూసే స్వభావం అలవడుతుంది. దీంతో జీవితంలో ఏదో ఒక రోజు పెద్ద ఎదురు దెబ్బ తింటారని విజ్ఞులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో పతనమయ్యే అవకాశం కూడా ఉంది. కావున ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోకపోవడమే సంతోషానికి మొదటి సూత్రం.
ఎదుటి వారిలో తప్పులను చూడడం..
కొందరు ఎల్లప్పుడూ తమ తప్పులను కాకుండా ఎదుటి వారి తప్పులను వెతికి పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారు జీవితంలో సంతోషంగా జీవించలేరు. కారణం ఎవరిని చూసినా వారి తప్పులే కనిపిస్తాయి. దీంతో ఎవరినీ పలకరించలేరు.. ఆనందంగా మాట్లాడలేరు. సంతోషం.. దుఃఖం ఇలా ఏ విషయాన్ని పంచుకోలేరు.
ఇదే ప్రవర్తన కొనసాగిస్తే చివరకు మనకంటూ ఓ మనిషి ఉండరు. ఒంటరిగా మిగిలిపోతాం. అందుకే మన లోపాలను తెలుసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే ప్రతీ క్షణం ఆనందమయంగా.. ప్రతి ఒక్కరూ ఆత్మీయులుగా కనిపిస్తారు. ఇక అప్పుడంతా ఆనందమే.. సంతోషమే..
మత గ్రంథాలను తక్కువగా చూడడం
చాలా మంది తెలిసీ తెలియని జ్ఞానంతో మత గ్రంథాలను తక్కు వ చేసి మాట్లాడుతారు. వాటిని అవహేళన చేస్తుంటారు. అది వారికి సంతోషాన్ని ఇవ్వకపోగా అజ్ఞాన అంధకారంలో పడవేస్తుంది. అలాంటి గ్రంథాల్లో మనిషి జీవన గమనానికి, సమస్యల్ని ఎదుర్కొని నిల్చే ధైర్యం పెంపొందించే ఎన్నో సూత్రాలు వాటిలో వివరించబడి ఉంటాయి.
భగవద్గీత చదివిన తరువాత, చదవక ముందు మనిషి ప్రవర్తనలో తేడాను స్పష్టంగా గమనించవచ్చు. భగవద్గీత చదవకముందు మనిషి జీవితం చిన్న సమస్య ఎదురైనా సుడిగుండంలో చిక్కుకున్న నావ లాగే ఉంటుంది. మరి చదివిన తరువాత కురుక్షేత్రంలో అర్జునుడి విజయం లాగా ఉంటుంది.
మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు భగవద్గీతలో పరిష్కార మార్గం ఉంది. వాటిని తెలుసుకొని వర్తమాన పరిస్థితులకు అన్వయించుకొని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడంతా ఆనందమే..
నాస్తికులుగా ఉండడం
నాస్తికులంటే కేవలం దైవం విషయంలో మాత్రమే కాదు. శాస్త్ర విజ్ఞాన విషయంలో కూడా. అలాంటి శాస్త్ర విజ్ఞానాలను నమ్మని వారి జీవితం తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు చందం అని వాదించడం లాగే వారి జీవితం ఉంటుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎవరి వల్ల..? ఏ కారణం వల్ల? బాధ పడుతున్నామో.. లేదా ఇబ్బంది పడుతున్నామో.. అలా మన వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా జీవించగలిగితే ఆ జీవితం ఆనందమయం అవుతుంది.