సప్త రంగాలంటూ.. అసలు రంగాలను వదిలేశారు: కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావు ఫైర్
budget 2023, minister harish rao, telangana విధాత: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో డొల్ల తనం కనిపిస్తోందని, అందమైన మాటలు తప్ప.. కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్ అంటూ విమర్శించారు. సప్త రంగాలంటూ.. అసలు రంగాలను వదిలేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా […]

budget 2023, minister harish rao, telangana
విధాత: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో డొల్ల తనం కనిపిస్తోందని, అందమైన మాటలు తప్ప.. కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్ అంటూ విమర్శించారు.
సప్త రంగాలంటూ.. అసలు రంగాలను వదిలేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతుంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదని, రాష్ట్రంలో ఒక్కదానికీ జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదని మండిపడారు.
నేతన్నలకు జీఎస్టీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్న ఆయన.. ఎరువులకు రాయితీలు భారీగా తగ్గించారన్నారు. నర్సింగ్, వైద్య కళాశాలల విషయంలో తెలంగాణకు మళ్లీ మొండి చేయి చూపారన్నారు. పేదలకు అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా బడ్జెట్‌ను కేంద్రం రూపొందించిందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేసిందన్నారు. దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరమన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్యను కుదించారని, పత్తి కొనుగోళ్లకు కేవలం రూ.లక్ష కేటాయించారన్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కేంద్రం పాటించడం లేదని, సెస్సులు, సర్‌చార్జీలు వల్ల రాష్ట్రాలు పన్నుల వాటా కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను భారీగా కుదించారన్నారు. ఉపాధి హామీకి గతంలో రూ.80వేలకోట్ల కేటాయింపులు ఉండేవన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే యోచనలో కేంద్రం-ఎర్రబెల్లి
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎత్తివేసే ఆలోచనలో ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
ఈ పథకానికి గతంలో రూ.73 వేల కోట్లు ఉండేవని, ఆ నిధులను రూ.60 వేల కోట్లకు తగ్గించారని అన్నారు.
కేంద్రం వైఖరి వల్ల కూలీలు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి హామీకి నిధుల కోతపై కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు స్పందించాలని కోరారు.