జగనన్న దిగొచ్చాడా..? రెడ్ లైన్ మీద ఉన్నవారు తగ్గినట్టేనా
విధాత: గతంలో జరిగిన రివ్యూలకు నిన్నజరిగిన రివ్యూలకు చాలా తేడా ఉంది. జగన్ ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలతో కాస్త సంయమనంతో మాట్లాడినట్లు ఉంది. గతంలో ఐతే దాదాపుగా యాభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్స్ ఉండవ్ చాలా మందిని మార్చేస్తా అంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్యా దాదాపు 20 వరకూ తగ్గించినట్లు తెలుస్తోంది. అంటే గతంలో జరిగిన సమావేశాల్లో 50 మంది వరకూ ఎమ్మెల్యేల పీకల మీద కట్టి వేలాడేది. […]

విధాత: గతంలో జరిగిన రివ్యూలకు నిన్నజరిగిన రివ్యూలకు చాలా తేడా ఉంది. జగన్ ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలతో కాస్త సంయమనంతో మాట్లాడినట్లు ఉంది. గతంలో ఐతే దాదాపుగా యాభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్స్ ఉండవ్ చాలా మందిని మార్చేస్తా అంటూ ఉండేవారు.
అయితే ఇప్పుడు ఆ సంఖ్యా దాదాపు 20 వరకూ తగ్గించినట్లు తెలుస్తోంది. అంటే గతంలో జరిగిన సమావేశాల్లో 50 మంది వరకూ ఎమ్మెల్యేల పీకల మీద కట్టి వేలాడేది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యా ఇరవై పాతిక వద్ద పరిమితం చేసినట్లు తెలిసింది.
వాస్తవానికి గతంలో జగన్ ఎమ్మెల్యేలతో కాస్త గట్టిగానే మాట్లాడేవారు. ఇలా చేస్తే ఎలా అన్న.. ఇలా ఐతే నెక్స్ట్ మీకు టికెట్ కష్టమే అందరి పెర్ఫార్మెన్స్ మదింపు చేస్తున్నాం ర్యాంకింగ్స్ లో కిందన ఉంటె టిక్కెట్ రాదని చెప్పేసేవారు.
ఈ లెక్క యాభై వరకూ ఉండేదని అప్పట్లో వార్తలు వచ్చేవి. అయితే ఇలా ఎక్గ్యాంగా 50.. 60 మందిని మారుస్తున్నాం అంటే అంతమంది మీద వ్యతిరేకత ఉందని మనమే గుర్తించినట్లు అవుతుందని, ఇది ప్రతిపక్షాలకు పాజిటివ్ గా మారుతుందని కొందరు నాయకులూ జగన్కి చెప్పినట్లు తెలిసింది.
అంటే యాభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని నేరుగా ప్రభుత్వం, వైఎసార్సీపి ఒప్పుకున్నట్లు అవుతుందని, ఇది క్యాడరులోనూ లేనిపోని సందేహాలకు తావిస్తోందని పార్టీ భావించింది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ లేనిపోని పుకార్లకు చెక్ పెట్టేందుకు జగన్ కూడా ఈసారి కాస్త అనునయంగా మాట్లాడారు అంటున్నారు.
ఈసారి నంబర్ కూడా ఇరవై పట్టిక దగ్గర ఆపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వ్యతిరేకత ఉన్న ఓ పాతిక ముప్పై సీట్లు మారుస్తారనిమ్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి, విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ వంటి వారు ఈసారి ఎమ్మెల్యేగా వెళతారని అంటున్నారు.. అలాంటపుడు అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చినట్లే భావించాల్సి ఉంటుంది.. ఎన్నికల కలం దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితి మారుతుందని అంటున్నారు.