Nalgonda: కాంగ్రెస్ వర్గాల్లో హుషారు.. గ్రామాల్లో ‘హాత్ సే హాత్ జోడో’ షురూ..!
విధాత: కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలను గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు కదనోత్సా హంతో ఆరంభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా మున్సిపాలిటీలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి జోడో యాత్రతో సందడి చేశారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించారు. ఇటు […]

విధాత: కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలను గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు కదనోత్సా హంతో ఆరంభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా మున్సిపాలిటీలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి జోడో యాత్రతో సందడి చేశారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించారు.
ఇటు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్రను వలిగొండ మండల కేంద్రంలో ప్రారంభించారు. స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ యాత్రను కొనసాగించారు.
ఆయన వెంట ఎంపీపీ నూతి రమేష్, జడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి, సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి , బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న గౌడ్, కంకణాల కిష్టయ్య తదితరులు ఉన్నారు.
హుజూర్‌నగర్, కోదాడలో స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో యాత్రలు షురూ చేశారు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందుబాటులో లేరు. ఆలేరు నియోజకవర్గం గూండాల మండలం వస్తా కొండూరులో నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య యాదవ్ యాత్ర ప్రారంభించారు.
నల్గొండ నియోజకవర్గంలో ఇన్‌చార్జి తండు సైదులు గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ఎల్ఐసి ముందు ధర్నా నిర్వహించారు. మునుగోడు, తుంగతుర్తిలలో స్థానిక నాయకత్వం యాత్రలు చేపట్టారు. దేవరకొండలో ఈ నెల 8 నుండి ప్రారంభిస్తామని మాజీ జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నేనావత్ బాలునాయక్ తెలిపారు.