గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
మామునూరు PTCలో సంఘటన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుండెపోటు(Heartattack)తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద సంఘటన వరంగల్ జిల్లా మామునూరు PTCలో మంగళవారం ఉదయం జరిగింది. హెడ్ కానిస్టేబుల్‌ను ప్రాణాలు కాపాడేందుకు అధికారులు హాస్పిటల్‌కి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పీటీసీ వర్గాలు తెలిపాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్(Warangal) జిల్లా మామునూరు పీటీసీలో ట్రైనింగ్ చేస్తుండగా […]

- మామునూరు PTCలో సంఘటన
- హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుండెపోటు(Heartattack)తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద సంఘటన వరంగల్ జిల్లా మామునూరు PTCలో మంగళవారం ఉదయం జరిగింది. హెడ్ కానిస్టేబుల్‌ను ప్రాణాలు కాపాడేందుకు అధికారులు హాస్పిటల్‌కి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పీటీసీ వర్గాలు తెలిపాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్(Warangal) జిల్లా మామునూరు పీటీసీలో ట్రైనింగ్ చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఒకసారి కుప్పకూలిపోయారు. తీవ్ర అస్వస్థకు గురి కాగా హనుమకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
కాగా.. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం లక్ష్మీ నారాయణ మృతి చెందినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీ (Nampally)నాంపల్లి పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వి. లక్ష్మీనారాయణ మామునూరు పోలీసు శిక్షణ కేంద్రంలో (PTC )శిక్షణ పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం సెలువులో హైదరాబాద్లోని ఇంటికి వెళ్లి నిన్న మామునూరుకి వచ్చినట్లు చెబుతున్నారు.