Hyderabad | నెల రోజుల్లో కుర‌వాల్సిన‌ వాన‌.. 24 గంట‌ల్లోనే ప‌డింది..

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత వ‌ర్షం కురుస్తూనే ఉంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఎడ‌తెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. ఆకాశానికి చిల్లు ప‌డిందా అన్న‌ట్లు వాన దంచికొడుతుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో జులై నెల‌లో మొత్తం కుర‌వాల్సిన వాన 24 గంట‌ల్లోనే ప‌డింది. బుధ‌వారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 188.3 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రికార్డుల ప్ర‌కారం 1991 […]

Hyderabad | నెల రోజుల్లో కుర‌వాల్సిన‌ వాన‌.. 24 గంట‌ల్లోనే ప‌డింది..

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత వ‌ర్షం కురుస్తూనే ఉంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఎడ‌తెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. ఆకాశానికి చిల్లు ప‌డిందా అన్న‌ట్లు వాన దంచికొడుతుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో జులై నెల‌లో మొత్తం కుర‌వాల్సిన వాన 24 గంట‌ల్లోనే ప‌డింది.

బుధ‌వారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 188.3 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రికార్డుల ప్ర‌కారం 1991 – 2020 వ‌ర‌కు 30 ఏండ్ల‌లో జులై నెల‌లో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 162 మి.మీ. గా న‌మోదైంది. జులై నెల‌లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం 11 ఏండ్ల క్రితం అంటే 2012లో 115.1 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. 2013లో 86.4 మి.మీ., 2014లో 60.6 మి.మీ., 2021లో 68.9 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

గురువారం ఉద‌యం 8.30 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆనంద్‌బాగ్‌లో అత్య‌ధికంగా 111.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, మియాపూర్‌లో 107.5, నాచారంలో 104.5, కాప్రాలో 99.8, హైద‌ర్‌న‌గ‌ర్ 93.5, ఉప్ప‌ల్‌లో 92.3, హ‌బ్సిగూడ‌లో 89.8, ఏఎస్ రావు న‌గ‌ర్ 89.3, మాదాపూర్‌లో 87.0, ఎల్‌బీ న‌గ‌ర్‌లో 85.8, కూక‌ట్‌ప‌ల్లిలో 84.3, బంజారాహిల్స్‌లో 83.0 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

నిన్న కురిసిన భారీ వ‌ర్షానికి న‌గ‌రమంతా జ‌ల‌మ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ‌ర్షానికి త‌డుస్తూనే గంట‌ల కొద్ది రోడ్ల‌పైనే ఉండిపోయారు. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేర‌డంతో, విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ప‌లు చోట్ల చెట్లు నేల‌కొరిగాయి. డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి, చెట్ల‌ను తొల‌గించారు.